రాష్ట్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తాత్కాలిక సిబ్బందితో అద్దె, ఆర్టీసీ బస్సులను అధికారులు నడుపుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ స్వల్ప సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ డిపోలో 100 బస్సులు ప్రయాణ ప్రాంగణానికే పరిమితమయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లతో 20 బస్సులను అధికారులు నడుపుతున్నారు. మియాపూర్ 1, 2 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. 316 బస్సులకు గానూ 43 బస్సులు నడుపుతున్నారు. వరంగల్ రీజియన్‌లో 402కు గానూ 167 బస్సులు రోడ్డెక్కాయి.
రెండోరోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - tsrtc strike second day
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రయాణికులు ఊర్లోకి వెళ్దాం అంటే బస్సులు లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
రెండోరోజూ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె