తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం - తెలంగాణలో గణతంత్ర వేడుకలు

అక్కడ గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథిలు హాజరు కాలేదు.. ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానాలు... లౌడు స్పీకర్లలో జాతీయ గీతాలు... బ్యాండు చప్పుళ్లు... ఇవేవీ లేవు. ఆఖరుకు జాతీయ జెండా ఎగురవేసేందుకు కర్ర కూడా లేదు. కానీ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆ చిన్నారులు. దేశభక్తి చాటుకునేందుకు ఆర్భాటాలే కావాలా..? మదిలో దేశభక్తి.. నోటితో జాతీయ గీతం.. కళ్లెదుట జాతీయ పతాకం ఉంటే చాలదా అనుకున్నారా చిన్నారులు. అందుబాటులో ఉన్న వనరులతో హంగులు, ఆర్బాటాలు లేకుండా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించి ఆదర్శంగా నిలిచిన ఆ చిన్నారుల వేడుకలను మీరూ ఓ లుక్కేయండి.

ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శమయ్యాయి
ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం

By

Published : Jan 26, 2021, 7:21 PM IST

ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం

కరోనా పాఠశాలకు తాళం వేయించింది. స్నేహితులను, పుస్తకాలను దూరం చేసింది. ఇక పాఠశాలలోనే నిర్వహించే వేడుకలు జ్ఞాపకాలుగానే మిగిల్చింది. అలాంటి తరుణంలో గణతంత్ర దినోత్సవాన్ని తమకున్న వనరులతో ఘనంగా నిర్వహించారు ఆ చిన్నారులు.

ఏటా జనవరి 26 వచ్చిందంటే... తమకున్నంతలో మంచిగా తయారై పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనే వారు ఆ చిన్నారులు. కానీ కరోనా ప్రభావం వల్ల పాఠశాల మూత పడడం వల్ల.. ఎలాగైనా వేడుకలు చేసుకోవాలనుకున్న చిన్నారులు ఇలా జరుపుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని ఆర్‌ఆర్‌సీ మైదానం వెళ్లే రోడ్డులో అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన కొందరు చిన్నారులు ఓచోట చేరి గణంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఉదయాన్నే అప్పటికప్పుడు వేడుకలు చేసుకుందామని అనుకుని కనీసం జెండా కూడా లేకపోవడం వల్ల పరీక్ష అట్టపై జాతీయ జెండా అమర్చి.. చుట్టూ స్టేషనరీ వస్తువులు పెట్టి వేడుక చేసుకున్నారు.

జాతీయ దినోత్సవాలైనా.. పండుగలైనా.. కేవలం సెలవురోజుగానే భావిస్తున్న కొందరున్న నేటి రోజుల్లో... కనీస వసతులు లేకపోయినా గణతంత్ర దినోత్సవాన్ని తమకున్న వనరులతో ఘనంగా నిర్వహించిన ఈ చిన్నారులు ఎందరికో ఆదర్శం.

ఇదీ చూడండి:కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details