జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు.. రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు - GHMC elections Latest Breaking News
![జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు.. రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు sec-wraps-up-preparations-for-municipal-elections-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8882991-9-8882991-1600693622299.jpg)
16:29 September 21
పురపాలక ఎన్నికలకు శ్రీకారం చుట్టిన ఎస్‌ఈసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభిస్తోంది. ఎన్నికల నిర్వహణపై ఇటీవలే సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది.
కరోనా మహమ్మారి ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహించాలా లేక బ్యాలెట్ విధానంలో నిర్వహించాలా అన్న విషయమై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఈ మేరకు గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఎన్నికలు ఏ విధానంలో నిర్వహిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని పార్టీలను కోరింది. నెలాఖర్లోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలో పేర్కొంది.
ఇదీ చూడండి :సర్పంచ్‌ను తొలగించాలంటూ కలెక్టరేట్ వద్ద గ్రామస్థుల ధర్నా