తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2020, 10:55 PM IST

ETV Bharat / state

'ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోలింగ్ జరిగే అవకాశం రాకూడదు'

జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

'ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోలింగ్ జరిగే అవకాశం రాకూడదు'
'ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోలింగ్ జరిగే అవకాశం రాకూడదు'

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎటువంటి పొరపాట్లు, అవకతవకలు జరిగినా క్షమించే ప్రసక్తి లేదని ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. ఎలాంటి కారణాల వల్ల కూడా రీపోలింగ్ జరిగే అవకాశం రాకూడదన్నారు.

ఎన్నికల పరిశీలకులు, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఎస్ఈసీ... ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఒకటికి, రెండుసార్లు పరిశీలించుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. 29 నాటికి ఓటరు స్లిప్పుల పంపిణీ వంద శాతం పూర్తి కావాలన్న పార్థసారథి... చనిపోయిన, ఇల్లుమారిన, నివాసంలేని వారి వివరాలను ఏఎస్డీ జాబితాలో చేర్చాలని చెప్పారు.

ప్రతిని అందించండి...

వార్డుల వారీ పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, పంపిణీ చేసిన వారి వివరాలను రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ప్రకటించి అభ్యర్థులకు ప్రతిని అందించాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి అవసరాన్ని బట్టి రెండుసార్లు శిక్షణ ఇచ్చి ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కల్పించాలని తెలిపారు.

వర్షం వచ్చినా...

పోలింగ్ సామగ్రి పంపిణీ, సేకరణ కేంద్రంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని... ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్​చైర్లు, ర్యాంపులు ఉండేలా చూడాలని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్థసారథి అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మున్నూరు కాపుల సమస్యల్ని పరిష్కరిస్తాం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details