తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘాన్సీపూర్‌, పూరానాపూల్‌పై ఎస్ఈసీ స్పష్టత.. నో రీపోలింగ్ - GHMC election latest news

ఘాన్సీపూర్‌, పూరానాపూల్‌పై ఎస్ఈసీ స్పష్టతనిచ్చింది. రీపోలింగ్‌ అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.

SEC said no repolling was required in Ghansipur and Puranapool divisionsSEC said no repolling was required in Ghansipur and Puranapool divisions
ఘాన్సీపూర్‌, పూరానాపూల్‌పై ఎస్ఈసీ స్పష్టత.. నో రీపోలింగ్

By

Published : Dec 4, 2020, 8:56 AM IST

Updated : Dec 4, 2020, 9:19 AM IST

ఘాన్సీబజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ అవసరం లేదని ఎస్ఈసీ తేల్చింది. రెండు డివిజన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరిగిందని... రీపోలింగ్‌కు ఆదేశించాలని భాజపా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 1, 2 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ.... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివరించారు.

దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం లెక్కింపు ప్రారంభించే లోపు చట్టప్రకారం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.... రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలీసుల నుంచి నివేదికలు తెప్పించుకుంది. సంబంధిత ఆర్వోలు, అభ్యర్థులకు రాత్రే లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చింది. కౌంటింగ్‌ యథావిథిగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అధికారుల నివేదికల ఆధారంగా.... ఆయా డివిజన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని తెలిపింది.

ఇదీ చూడండి:కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Dec 4, 2020, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details