ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రిస్తామని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. నగదు రవాణాపై మరింత నిఘా ఉంచుతున్నామని, చెక్‌పోస్టుల్లో పటిష్టమైన తనిఖీలు జరుపుతున్నామని వెల్లడించారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు నిశితంగా పరిశీలిస్తాయని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు.
'ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం' - ఏపీ తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ఎన్నికల్లో డబ్బు పంపిణీపై నిఘా ఉంచినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిఘా పెట్టాలని ఐటి విభాగంలోని అత్యున్నత స్థాయిలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. మద్యం సరఫరాను నియంత్రించేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
!['ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం' sec](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10827502-799-10827502-1614602750573.jpg)
'ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం'
ప్రలోభాలపై సమాచారం అందివ్వాలని కోరిన కమిషన్... అందుకున్న సమాచారాన్ని మొత్తం గోప్యంగా ఉంచతామని తెలిపారు. మద్యం సరఫరా ను నియంత్రించేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు.