తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి : పార్థసారథి

గ్రేటర్​ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విజ్ఞప్తి చేశారు. విద్యావంతులైన యువత అధికసంఖ్యలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.

By

Published : Nov 23, 2020, 5:09 PM IST

SEC Parthasarathi request people vote in ghmc elections
ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి : పార్థసారథి

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విద్యావంతులైన యువత పెద్దఎత్తున ఓటింగ్​లో పాల్గొనాలని ఎస్​ఈసీ పార్థసారథి కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అభివృద్ధిని నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లో ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.

కరోనా రోగులకు పోస్టల్​ బ్యాలెట్ సౌకర్యం: ఎస్​ఈసీ

కరోనా రోగులు, దివ్యాంగులకు, వృద్ధులకు పోస్టల్​ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కరోనా వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని....నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. ప్రజలు అధికసంఖ్యలో ఓటింగ్​లో పాల్గొని పోలింగ్​ శాతాన్ని పెంచాలని ఎస్​ఈసీ పార్థసారథి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:24న పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ : జీహెచ్​ఎంసీ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details