తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇలా ఎలా జరిగిందో చెప్పండి.. నివేదికలు పంపండి' - ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆగ్రహం వార్తలు

ఏపీలోని చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ చర్యలు చేపట్టింది. అనుమతిచ్చేదాకా ఏకగ్రీవాల ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరు జిల్లాల కలెక్టర్లను ఏకగ్రీవ ఫలితాల నివేదికలను అందించాలని కోరింది.

'ఇలా ఎలా జరిగిందో చెప్పండి.. నివేదికలు పంపండి'
'ఇలా ఎలా జరిగిందో చెప్పండి.. నివేదికలు పంపండి'

By

Published : Feb 5, 2021, 12:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జిల్లాల్లోనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగినట్లు తెలిపింది. అనుమతి ఇచ్చే వరకూ వాటి తుది ఫలితాల ప్రకటన నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

రెండు జిల్లాలో ఎన్నికల తీరుపై ఆయా కలెక్టర్లును నివేదికలు పంపాలని ఆదేశించింది. వాటిని పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏకగ్రీవాల నేపథ్యంలో.. వైఫల్యాలు బయటపడితే చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది.

ఇదీ చూడండి:సినీఫక్కీలో చోరీ... తాళ్లతో కట్టేసి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

ABOUT THE AUTHOR

...view details