ఏపీ మంత్రి కొడాలి నానిపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొడాలి నానిపై తగు చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఎస్ఈసీపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్ నోటీసు ఇచ్చారు.
ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు - ap news
ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొడాలి సమాధానంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంతృప్తి చెందలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీలను ఆదేశించారు. మీడియాతో పాటు సభల్లో మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు.
![ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10604519-347-10604519-1613150142005.jpg)
ఏపీ మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు
మంత్రి వివరణపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 21 వరకు మీడియాతో పాటు సభలు, సమావేశాల్లో మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:రాబోయే ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం : తల్లోజు ఆచారి