మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలతో.. ఈనెల 21వరకు మీడియాతో మాట్లాడవద్దంటూ ఆదేశించిన ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. మరింత కఠినచర్యలు చేపట్టారు. కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
కొడాలి నానిపై కేసు నమోదు చేయండి: నిమ్మగడ్డ - మంత్రి కొడాలి నానిపై కేసు తాజా వాత్తలు
మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పోలీసులని ఆదేశించారు. ఎన్నికల కమిషన్, కమిషనర్ పైన మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేసు నమోదు చేయాలని సూచించారు.
కొడాలి నానిపై కేసు నమోదు చేయండి: నిమ్మగడ్డ
ఎన్నికల కమిషన్ పైన, కమిషనర్ పైన మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో పాటు ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 ప్రకారం ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా కృష్ణా జిల్లా ఎస్పీకి నిమ్మగడ్డ సూచించారు.
ఇదీ చదవండి:పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 10.30 గంటలకు ఓటింగ్ శాతం..