ఆంధ్రప్రదేశ్లో బలవంతంగా... నామినేషన్ల ఉపసంహరణ ఆరోపణలపై ఎస్‌ఈసీ మరోసారి స్పందించింది. పోలీసులకు అందిన ఫిర్యాదులను ఆర్వోలు పరిశీలించాలని ఆదేశించినట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు నిర్దిష్ట సూచనలు, ఆదేశాలిచినట్లు వెల్లడించారు. ఫిర్యాదులకు సంబంధించి ప్రతి సంఘటనపై కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు.
'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది'
ఆంధ్రప్రదేశ్లో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణపై అత్యవసర చర్యలకు ఆ రాష్ట్ర ఈసీ ఉపక్రమించింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులను రిటర్నింగ్ అధికారులను పరిశీలించాలని ఆదేశించినట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు నిర్దిష్ణ సూచనలు చేశామని, ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
sec
తిరుపతి 7వ డివిజన్‌లో బలవంతపు ఉపసంహరణ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఆర్వోతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై అత్యవసర చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి:ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. దంపతులకు గాయాలు