ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు పని చేస్తారని ఆ రాష్ట్ర ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. నెల్లూరులో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ అందరూ కలిసే ఉంటారని.. అప్పటి వరకే ఇలాంటి విభేదాలని అన్నారు.
'ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే' - నెల్లూరులో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సమావేశం వార్తలు
ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకే వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హెచ్చరించారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటీపడడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. అధిక సంఖ్యలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోవాలని నెల్లూరులో విజ్ఞప్తి చేశారు.
'ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే'
ఏకగ్రీవాలు శ్రుతి మించితే అధికారుల వైఫల్యం కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఉద్ఘాటించారు. ఎన్నికల విషయంలో చాలా గ్రామాలు ఒకే ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాయని.. ఆదర్శవంతంగా స్పందించాయని ప్రశంసించారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటీపడడం శుభపరిణామమన్న ఆయన.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి :ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా మామునూరు పీటీసీ..