ఆంధ్రప్రదేశ్లో రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. సీఈసీకి ఉండే అధికారాలే ఎస్‌ఈసీకి ఉంటాయని.. అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరించారు.
అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలి: నిమ్మగడ్డ - sec ramesh on panchayath elections
ఆంధ్రప్రదేశ్లో రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సీఈసీకి ఉండే అధికారాలే ఎస్‌ఈసీకి ఉంటాయని.. అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలన్నారు.
NIMMAGADDA ON ELECTIONS
గత అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. ఐపీఎస్ అధికారికి ప్రత్యేకంగా శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి:ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక