ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయవాడలో పోలింగ్ ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం వరకు విజయవాడ నగరంలో పలు పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ ఆకస్మిక తనిఖీ చేయనున్నారు.
'ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి' - విజయవాడ మున్సిపల్ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆ రాష్ట్ర ఈసీ పరిశీలిస్తున్నారు. సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. రాజ్యాంగ బద్ధ హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎస్ఈసీ సూచించారు.
'ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి'
'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశాం. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పరిస్థితులు కల్పించాం. రాజ్యాంగ బద్ధ హక్కును వినియోగించుకోవాలి.' -ఎస్‌ఈసీ రమేశ్ కుమార్