రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమయ్యారు. పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి భేటీ అయ్యారు. గుర్తింపు ఉన్న, ఎస్ఈసీ వద్ద నమోదు చేసుకున్న పార్టీలకు ఆహ్వానించారు.
ఎస్ఈసీ అఖిలపక్ష భేటీ.. వాకౌట్ చేసిన కాంగ్రెస్.. - రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ..
రాష్ట్ర ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చ జరుగుతుండగా... సమావేశం నుంచి కాంగ్రెస్ ప్రతినిధులు అధికారుల తీరు సరిగా లేదని వాకౌట్ చేశారు
రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ నాగిరెడ్డి చర్చిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయంపై చర్చ జరుగుతుంది. కానీ ఈ సమావేశం నుంచి కాంగ్రెస్ ప్రతినిధులు అధికారుల తీరు సరిగా లేదని వాకౌట్ చేశారు.
ఇదీ చూడండి:'సీపీ అంజనీకుమార్ మీ పోస్టు శాశ్వతం కాదు'
Last Updated : Dec 28, 2019, 2:58 PM IST