తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ పరిషత్ ఎన్నికల పిటిషన్లపై విచారణ 30కి వాయిదా - పరిషత్ ఎన్నికలపై వర్ల రామయ్య పిటిషన్ విచారణ

ఆంధ్రప్రదేశ్​ పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు ఆ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చాయి. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.

panchayath elections, ap high count
panchayath elections

By

Published : Apr 23, 2021, 4:21 PM IST

ఆంధ్రప్రదేశ్​లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణను.. ఈనెల 30కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జనసేన, భాజపాలతో పాటు తెదేపా నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాలు న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details