ఏపీ పంచాయతీపోరులో ఏకగ్రీవాలపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. రెండు రోజుల్లో విజేతలకు డిక్లరేషన్లు అందజేయాలని అధికారులను ఆదేశించింది.
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ పచ్చజెండా - ap panchayth elections latest news
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఏకగ్రీవాలపై ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది.
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ పచ్చజెండా
రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవమైనందున, అక్కడ ఫలితాలు ప్రకటించవద్దని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రమేశ్ కుమార్ ఈ నెల 5న ఆదేశాలు జారీ చేశారు. ఏకగ్రీవాలు జరిగిన తీరుపై నివేదికలు పంపాలని ఆ జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. నివేదికలు పరిశీలించిన అనంతరం ఎస్‌ఈసీ తాజా ప్రకటన చేశారు.
ఇదీ చదవండి:మంత్రి కేటీఆర్‌ను సెల్ఫీ కోరిన వృద్ధురాలు