మినీపురపోరు పోలింగ్ తీరుతెన్నులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. పోలింగ్ సజావుగా సాగుతోందని... పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారని ఓటింగ్ కేంద్రాలను సందర్శించిన పరిశీలకులు, కలెక్టర్లు చెప్పినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది అందరూ మాస్కులు, ఫేస్ షీల్డ్స్, హ్యాండ్ గ్లౌవ్స్ ధరించారని.... ఓటర్లు కూడా మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు.
పోలింగ్ సజావుగా సాగుతోంది: ఎస్ఈసీ - మున్సిపల్ ఎన్నికల పోలింగ్
మినీపురపోరు పోలింగ్ కొవిడ్ నిబంధనలకు లోబడి సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామని... అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయని ఎస్ఈసీ పేర్కొన్నారు.
municipal
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేముందు ఓటర్లు శానిటైజేషన్ చేసుకుంటున్నారని అన్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులకు ఓటింగ్లో ప్రాధాన్యం ఇస్తున్నారని, వీల్ ఛైర్లతో వాలంటీర్లు వారికి సహాయపడుతున్నారని పార్థసారథి వెల్లడించారు.
ఇదీ చూడండి:కొవిడ్ నిబంధనల మధ్య కొనసాగుతోన్న మినీ పుర పోలింగ్
Last Updated : Apr 30, 2021, 2:51 PM IST