తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌ - హైదరాబాద్ వరదలు

ghmc floods
ghmc floods

By

Published : Nov 18, 2020, 3:10 PM IST

Updated : Nov 18, 2020, 3:54 PM IST

15:09 November 18

వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు

వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌ వేసింది. గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున ప్రక్రియను వెంటనే ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో కోడ్ అమల్లో ఉండగా ఇలా సాయం చేయడంపై పలు పార్టీలతోపాటు... స్వచ్ఛందసంస్థలు ఫిర్యాదు చేయడంపై ఎన్నికల సంఘం స్పందించింది.

హైదరాబాద్​ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం అందజేస్తోంది. ప్రభుత్వం అందించే సాయంకోసం బాధితులు ‘మీ సేవ’ కేంద్రాల వద్ద బారులు తీరారు. వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితులకు స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. అ

కొన్నిచోట్ల సాయం అందడంలేదని ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే అందజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన  ప్రభుత్వం సాయం అందని వారు ‘మీ సేవ’ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో నగరంలోని అన్ని చోట్ల ఆయా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.  

ఈ క్రమంలో తాజాగా గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున వరద సాయం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.  

ఇదీ చదవండి :గ్రేటర్​ పోరు: సర్కిళ్ల వారీగా నోటీసు విడుదల చేసిన ఆర్వోలు

Last Updated : Nov 18, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details