హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పోలీస్ స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం - హైదరాబాద్ గోషామహల్
హైదరాబాద్ గోషామహల్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
![పోలీస్ స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం scrap vehicles are burned in fire accident at hyderabad goshamahal police stadium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6314529-534-6314529-1583477233154.jpg)
గోషామహల్లో భారీ అగ్నిప్రమాదం
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లు సాయంతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో స్టేడియంలోని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోషామహల్లో భారీ అగ్నిప్రమాదం