తెలంగాణ

telangana

ETV Bharat / state

కాదేదీ వ్యర్థం.. ఉపయోగిస్తేనే ఉంటుంది అర్థం..!

పదునైన ఆలోచనకు పనికిరాని పనిముట్లు ఓ ఆకారాన్నిచ్చాయి. సృజనాత్మకతకు వెల్డింగ్ ఊపిరి పోసింది. కళాకారుడి అపార ప్రతిభ.. ఇనుప తుక్కుకు కొత్త మెరుగులు అద్దింది. రోబో సినిమాలో చిట్టిలాగా ఈ బొమ్మలు కదల్లేవు కానీ అంతకు మించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జీవం ఉట్టిపడే ఆ కళాకృతులు పార్కులు, స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీల్లో కొలువుదీరాయి. దేశ, విదేశాల్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాయి.

sculptures
కాదేదీ వ్యర్థం.. ఉపయోగిస్తేనే ఉంటుంది అర్థం..!

By

Published : Nov 22, 2020, 7:57 PM IST

కాదేదీ వ్యర్థం.. ఉపయోగిస్తేనే ఉంటుంది అర్థం. ఆలోచనకు రూపం రావాలే గానీ, వ్యర్థాలైనా కళాఖండాలుగా మారుతాయి. ఇదే రీతిలో...అద్భుతమైన శిల్పాలు ఆవిష్కరిస్తున్నారు ఈ కళాకారులు.! వీరి సృజనాత్మకతతో వ్యర్థాలు ఆకట్టుకునే కళారూపాలయ్యాయి. వృథా వస్తువులే షోకేజీ బొమ్మలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు కుటుంబం.. విగ్రహాల తయారీలో సిద్ధహస్తులు. వారసత్వంగా వస్తున్న ఈ కళను వెంకటేశ్వరరావు... సూర్య శిల్పశాల ఏర్పాటు చేసి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన తనయుడు రవిచంద్ర.. మరింత వినూత్నంగా ఆలోచించి ఇనుప తుక్కుతో చక్కటి శిల్పాలు రూపొందిస్తున్నారు. ఈ కళపై చైనాలో శిక్షణ పొందిన రవిచంద్ర భారీ పరిమాణంలో శిల్పాలు తయారు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

విదేశాల్లో ప్రదర్శనలు

కాటూరి కుటుంబం తయారు చేసిన విగ్రహాలు వివిధ నగరాల్లో పార్కులు, కూడళ్లు సహా స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీల్లో కొలువుదీరాయి. ఇక్కడ కనిపిస్తున్న అందమైన భారీ బొమ్మలతో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలూ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కళాఖండాలను చూసిన ఓ సింగపూర్ సంస్థ వీరిని సంప్రదించింది. ఆ సంస్థ సహకారంతో అక్కడా ప్రదర్శనలు ఇచ్చారు.

కాదేదీ వ్యర్థం.. ఉపయోగిస్తేనే ఉంటుంది అర్థం..!

అంత సులభం కాదు

స్క్రాప్ ద్వారా విగ్రహాల తయారీ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పాత ఇనుప వస్తువులు సేకరించటం, తీసుకురావటం నుంచి విగ్రహాల తయారీ, తరలింపు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఆయా జంతువులు లేదా వస్తువుల్లా ఉండే భాగాలను పోలిన విధంగా వ్యర్థాలుండటం తప్పనిసరి. కటింగ్, వెల్డింగ్ ప్రక్రియలో ఏ మాత్రం ప్రణాళిక లేకపోయినా రూపం మారే అవకాశం ఉంటుంది. ఒక్కో విగ్రహానికి రూ. 3 నుంచి 5 లక్షలు ఖర్చవుతుంది. తయారీ తర్వాత కొన్ని విగ్రహాలు ఏకంగా 500 కిలోలకు పైగా బరువున్నాయి.

ప్రపంచ రికార్డు కోసం

విగ్రహాల తయారీకి ఇప్పటివరకూ వీరు 100 టన్నులకు పైగా తుక్కు ఉపయోగించారు. స్క్రాప్ ద్వారా ఇంత భారీ విగ్రహాల తయారీ అరుదైన విషయం కావడంతో ప్రపంచ రికార్డు కోసం గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ వారికి వివరాలు పంపారు.

ఇదీచదవండి:మేయర్ పీఠమే లక్ష్యంగా తెరాస ప్రచార హోరు

ABOUT THE AUTHOR

...view details