తెలంగాణ

telangana

సంక్రాంతి కానుక... జనవరి 5 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు

By

Published : Dec 25, 2019, 7:31 AM IST

రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. పండుగ సందర్భంగా సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది.

మెుదలైన సంక్రాంతి పండుగ రద్దీ... ప్రత్యేక ఏర్పాట్లల్లో ద.మ.రై
మెుదలైన సంక్రాంతి పండుగ రద్దీ... ప్రత్యేక ఏర్పాట్లల్లో ద.మ.రై

సంక్రాంతి పండుగ రద్దీ అప్పుడే మొదలైంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ కోసం వెళ్తే జాబితా పెద్దగానే కనిపిస్తోంది. ఏ రైలు చూసినా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే జనవరి 5 నుంచి 25 వరకు 201 ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. వీటిలో 13 సువిధ రైళ్లు, ఆరు జన సాధారణ్ రైళ్లు ఉన్నాయి. అయినప్పటికీ రైళ్లు సరిపోవట్లేదని ప్రయాణికులు అధికారుల దృష్టికి తెస్తున్నారు.

'రద్దీని బట్టి రైళ్ల సంఖ్య... అదనపు కోచ్​లు'

ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను, అదనపు కోచ్​లను పెంచేందుకు ప్రయత్నిస్తామని రైల్వే శాఖ పేర్కొంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ, మచిలీపట్నం, భువనేశ్వర్, విజయవాడ-విజయనగరం, కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-కాకినాడ, తిరుపతి-నాగర్ సోల్, కాచిగూడ-శ్రీకాకుళం రోడ్, కరీంనగర్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-తిరుపతి, హైదరాబాద్-కొల్లం, కాచిగూడ-టాటా నగర్, హైదరాబాద్-జైపూర్, నాందేడ్-తిరుపతి, నర్సాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-విజయవాడ వంటి ప్రధాన ప్రాంతాలకు రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖీ.

మెుదలైన సంక్రాంతి పండుగ రద్దీ... ప్రత్యేక ఏర్పాట్లల్లో ద.మ.రై

ఇవీ చూడండి : తోటివారి కోసం ఆ విద్యార్థులు ఏం చేశారో తెలుసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details