Bike Theft In Guntur: సాధారణంగా బండి మీద బయటికి వెళ్లినప్పుడు చాలా మంది చేసే పని తాళాన్ని బండికి ఉంచడం. అదృష్టం బాగుంటే మనం వచ్చే వరకు బండి అలాగే ఉంటుంది.. లేకపోతే అంతే సంగతులు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని గుంటూరులో జరిగింది. నగరంలోని చంద్రమౌళి నగర్ వద్ద ఉన్న దుకాణం వద్దకు ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద వచ్చాడు. అనంతంరం బండికి తాళం అలానే ఉంచి ఆ వ్యక్తి లోపలికి వెళ్లాడు.
బండికి తాళం వేసి కీ మరిచాడు.. లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి..! - స్కూటీ దొంగతనాలు
Scooty Theft At Guntur: సాధారణంగా ఈ రోజుల్లో బయటికి వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది ద్విచక్రవాహనం. ఎక్కడికి వెళ్లాలన్నా బండి మీద వెళ్తారు. అయితే ఎక్కడికి వెళ్లినా బండికి తాళం వేసి లోపలికి వెళ్తాము. కొన్ని సందర్భాలలో తాళం బండికే ఉంచుతాం. అయితే ద్విచక్ర వాహనం నిలిపి.. బండికే తాళం ఉంచితే.. ఏమవుతుందో ఇక్కడ జరిగిన ఘటన రుజువు చేసింది.

Bike Theft In Guntur
ఇంతలో ఓ దుండగుడు అక్కడికి వచ్చాడు. ఇంకేముంది బండికి తాళం ఉండటం చూసి.. ఆ బైక్‌ని స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. బయటికి వచ్చిన ఆ వ్యక్తి అక్కడ బండి లేకపోవడం చూసి షాకయ్యాడు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బండికి తాళం వేసి కీ మరిచాడు.. లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి..!
ఇవీ చదవండి: