కొవిడ్ వ్యాప్తికి జెనెటికల్ మార్పులతో పాటు జీవన విధానం, రోగ నిరోధకశక్తి వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్ కొందరిలో తీవ్ర ప్రభావం చూపడానికి మరి కొందరిలో కనీసం లక్షణాలు లేకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు.
కరోనావ్యాప్తిలో డీఎన్‌ఏ పాత్రపై... అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సౌత్ ఏషియన్‌లో పరిశోధన చేశారు. యూరోపియన్‌లలో వైరస్ తీవ్రతకు కారణమైన డీఎన్‌ఏ... సౌత్ ఏషియన్‌లో పెద్దగా ప్రభావం చూపలేదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు.