ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్లో సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Schools: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయాల కల్పన - telangana varthalu
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతుల తరహాలో ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. మౌలిక వసతుల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన సిఫార్సులను ముఖ్యమంత్రి కేసీఆర్కు సమర్పించాలని ఉపసంఘం నిర్ణయించింది.