జూన్‌లో ప్రారంభం కావలసిన బడులు కరోనా నేపథ్యంలో... ఇప్పటివరకు తెరుచుకోలేదు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకూడదన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఆన్లైన్ తరగతులపై నిర్ణయం తీసుకున్నారు.
ఆన్లైన్ తరగతికి వేళాయే... పాఠశాలల్లో శానిటైజేషన్ షురూవాయే! - ఆన్లైన్ తరగతులకై సిద్ధమవుతున్న పాఠశాలలు
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో... హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలను సన్నద్ధం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయంతో భవనాలను పూర్తిగా శానిటేషన్ చేయిచి.. శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆన్లైన్ తరలగతులకై శానిటైజ్ అవుతున్న పాఠశాలలు
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొవిడ్ నియమ నిబంధనలకు లోబడి పాఠశాలలను ప్రారంభించుకోవచ్చన్న ఆదేశాల మేరకు యాజమాన్యాలు పాఠశాలలను శానిటైజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం జీఎచ్ఎంసీ సిబ్బంది సహాయంతో పాఠశాల మొత్తం శానిటేషన్ చేయించారు. స్కూల్‌కి వచ్చే ఉపాధ్యాయులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి