తెలంగాణ

telangana

ETV Bharat / state

School reopen: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..! - కోరనా థర్డ్​ వేవ్

ఏపీలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని జగన్​ సర్కార్ నిర్ణయించింది. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈనెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

schools reopen
ఏపీలో పాఠశాలలు

By

Published : Jul 7, 2021, 2:28 PM IST

Updated : Jul 7, 2021, 2:34 PM IST

ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని(schools reopen) ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం జగన్​ సమీక్ష నిర్వహించారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.

పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా జగన్​ చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని.. తద్వారా ఏ స్కూల్ మూతపడదని స్పష్టం చేశారు. నూతన విద్యావిధానం అమలుతో ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని మంత్రి సురేశ్‌ తెలిపారు. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదుల నిర్మించనున్నట్లు వెల్లడించారు. నాడు- నేడు కింద పనులకు రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. ఈనెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పదో తరగతిలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజిగా తీసుకుని ఆ ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:LIVE UPDATES: పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్​

Last Updated : Jul 7, 2021, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details