School Time Table Change in Telangana : రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్పు - తెలంగాణలో పాఠశాలల పని వేళలు
19:41 July 24
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు ప్రాథమిక పాఠశాలలు
School Timings in Telangana : రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం స్కూల్ ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 9.30 గంటలకి మార్చింది. అదే విధంగా ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు మార్చింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారుస్తు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాల వల్ల విద్యాశాఖ ఈ మార్పులను చేసిందని వెల్లడించింది. ఈ సమయం రాష్ట్రంలో జంట నగరాలకు మినహా.. అన్ని జిల్లాలకు వర్తించనున్నదని తెలిపింది. రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడంతో ఇప్పటికే ప్రభుత్వం స్కూల్‌కి ఆదివారంతో కలిపి నాలుగు రోజులు సెలవులు ఇచ్చింది. ఈ సమయ వేళల మార్పు ప్రభుత్వ పాఠశాలలకేనా లేక ప్రవేటు పాఠశాలలకి కూడా అనే విషయంలో స్పష్టత తెలియవల్సి ఉంది.
HEAVY RAINS IN TELANAGNA : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులు సెలవు ప్రకటించింది. గురువారం, శుక్రవారం, శనివారం విద్యా సంస్థలకు సెలవు ఇస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య విద్యాశాఖ విద్యాసంస్థలకు సమయ వేళలు మార్పు చేసింది. దీంతో వరుసగా నాలుగు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చినట్లైంది.
ఇవీ చదవండి :