Ayyappa Mala Student: అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చిన విద్యార్థిని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని డీపాల్ పాఠశాల ఫాదర్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. విద్యార్థి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న ఆంజనేయరెడ్డి బుధవారం అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చాడు. మాల తీసివేసి, బూట్లు ధరించి వస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని, లేదంటే వెళ్లిపోవాలని ఫాదర్ ఆనంద్ స్పష్టం చేశారు.
అయ్యప్ప మాల ధరించి వచ్చాడని విద్యార్థిని అడ్డుకున్న ఫాదర్..
Ayyappa Mala: అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చిన విద్యార్థిని ఆ పాఠశాల ఫాదర్ అడ్డుకున్నాడు. దీంతో విద్యార్థి కుటుంబసభ్యులకు విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, మాలధారులు పాఠశాల దగ్గరకు చేరుకుని నిరసన చేపట్టారు. ఇంతకీ ఇది ఎక్కడంటే..
Ayyappa Mala Student
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు విద్యార్థి చెప్పాడు. పాఠశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ అతని తల్లిదండ్రులు, అయ్యప్పస్వామి మాలధారులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు బడి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. మాల వేసుకుని బడికి రాకూడదని నిబంధనలు ఉన్నాయని ఫాదర్ చెప్పారు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వీహెచ్‌పీ సభ్యులు కోరారు. కాసేపటి తర్వాత విద్యార్థి మాల వేసుకుని పాఠశాలకు వచ్చేందుకు ఫాదర్ అనుమతించడంతో వివాదం సర్దుమనిగింది.
ఇవీ చదవండి: