తెలంగాణ

telangana

ETV Bharat / state

బురదలో ఇరుక్కున్న బస్సు.. బయటకు నెట్టిన స్థానికులు - నెల్లూరులో బురదలో ఇరుక్కున్న ప్రైవేట్ స్కూల్ బస్సు

ఏపీలోని నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం కలిగిరి రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుంది. దీంతో ఆ బస్సును స్థానికులు బయటకు తీశారు. రోడ్డు పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ వారు వాపోయారు.

A school bus stuck in the mud
A school bus stuck in the mud

By

Published : Nov 24, 2022, 7:45 PM IST

Updated : Nov 24, 2022, 8:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం గుడిపాడు వద్ద నుండి కలిగిరికి వెళ్లే రోడ్డు వర్షాలకు బురదమయంగా తయారయ్యింది. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుంది. దీంతో విద్యార్థులంతా బస్సులో నుంచి దిగగా స్థానికుల సహాయంతో బురదలో ఇరుక్కుపోయిన బస్సును బయటకు తీశారు. రోడ్డు పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ వారు వాపోయారు.

బురదలో ఇరుక్కున్న బస్సు.. బయటకు నెట్టిన స్థానికులు
Last Updated : Nov 24, 2022, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details