Tribal Development In Telangana : రాష్ట్రంలో మొత్తం 3,146 తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారడంతో గిరిజనుల హర్షధ్వానాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది మంది ఆదివాసీ, లంబాడీ, గిరిజన యువతీ యువకులు, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచి రాజకీయ అధికారంలో భాగస్వాములై రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కేవలం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వేయడంతోనే, రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోలేదు.
Telangana Tribal Development : ప్రతీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజన సంక్షేమశాఖలో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 1,287 తండాలకు, గూడేలకు రహదారి సౌకర్యం కల్పించడం కోసం 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి 1,385 కోట్లు మంజూరు చేసింది. బీటీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి.
ఎస్టీఎస్డీఎఫ్ కింద రాష్ట్రంలోని ఎస్టీ ఆవాసాల 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో 88 బీటీ రోడ్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో భాగంగా 211.86 కిలోమీటర్ల పొడవునా బీటీ రోడ్లను వేసేందుకు 156.60 కోట్ల రూపాయల అంచనాతో 88 పనులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమంతించబడిన బీటీ రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
అధికార యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఎస్డీఎఫ్ చట్టం 2017 ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించే నిధులకు ఉద్దేశించిన నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్ 2017ను ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎస్డీఎఫ్ కింద ఇప్పటివరకు ఎస్టీల సంక్షేమానికి 47 వేల 282 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం మంజూరైన బీటీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు రంగంలోకి దిగింది.