రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు - rain news in telangana
రాష్ట్రంలో రాగల మూడురోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడ వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. తూర్పు- పశ్చిమ వెంబడి ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 కి.మీ. నుంచి 3.6కి.మీ. ఎత్తు మధ్య కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వివరించింది.