తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగునీటికి కటకట - AFZAL MPTC

వేసవి వచ్చిందంటే చాలు ఆ ఏరియాలో తాగునీటికి కష్టాలు ఎదురవుతాయి. నీటి ట్యాంకర్లతో 8 రోజులకోసారి నీరు సరఫరా చేస్తారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

By

Published : Mar 10, 2019, 11:00 PM IST

తాగు నీరు రావట్లేదని ఖాళీ బిందెలతో మహిళల నిరసన
తాగు నీరు రావట్లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపిన ఘటన మహేశ్వరంలోని ముస్తఫా ప్రాంతంలో చోటుచేసుకుంది. వేసవి రాగానే తమ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. జల్​పల్లి మున్సిపల్ కమిషనర్​కు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య పరిష్కరించట్లేదని వాపోయారు.

ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి

సమస్యను కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లినా స్పందించట్లేదని జల్​పల్లి ఎంపీటీసీ అఫ్జల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :స్లాబుల మాయజాలం

ABOUT THE AUTHOR

...view details