తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2019, 7:16 PM IST

ETV Bharat / state

'రోస్టర్​ విధానం కోసం రీ కౌన్సెలింగ్​ నిర్వహించండి'

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రోస్టర్​ పద్ధతిలో రీ కౌన్సెలింగ్​ నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

'రోస్టర్​ విధానం కోసం రీ కౌన్సెలింగ్​ నిర్వహించండి'

టీఆర్టీ నియామకాల్లో రోస్టర్​ (ఎస్సీ,ఎస్టీ, బీసీ) పద్ధతిని పాటించకపోవడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హైదరాబాద్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. వీరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కౌన్సెలింగ్​లో రోస్టర్​ కమ్​ మెరిట్​ అనే ప్రాతిపదికన స్థానాలు కేటాయించాల్సి ఉంటే రోస్టర్​ అండ్​ మెరిట్​ కింద ఖాళీలు భర్తీ చేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోయారన్నారు.

'రోస్టర్​ విధానం కోసం రీ కౌన్సెలింగ్​ నిర్వహించండి'

​ గత నోటిఫికేషన్​లో ఎక్కడ రోస్టర్​ ముగిసిందో.. ఇప్పడు ఏ సంఖ్య వద్ద ప్రారంభమైందో ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేత కొంగల వెంకట్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే రీ కౌన్సెలింగ్​ నిర్వహించాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రాష్ట్ర, జాతీయ కమిషన్​లతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: కేసీఆర్​ పలుకులు వినడానికేనా సభ: భట్టి

ABOUT THE AUTHOR

...view details