బ్యాంకుల మెరుగైన పనితీరుకు కొత్త చట్టాలు, సవరణలతో కూడిన రిజల్యూషన్స్ అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ చట్టాలలో నూతన ధోరణులు... భారత సామాజిక, ఆర్థిక ప్రగతిపై వాటి ప్రభావం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రైవేటు బ్యాంకుల కన్నా.. ప్రభుత్వరంగ బ్యాంకులే అధిక మొత్తంలో రుణాలిస్తున్నాయని.. వాటి రికవరీలో మాత్రం ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే వెనుకబడిపోతున్నాయని తెలిపారు. చాలా కోర్టులు వసతులు లేమితో సతమవుతుంటే.. కొన్నిచోట్ల కార్పోరేట్ స్థాయిలో ఉన్నాయని.. కోర్టు భవనాల అడ్మినిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక కేటాయింపులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త చట్టాలతోనే బ్యాంకుల పనితీరు మెరుగు - Sc Justice Subhash reddy talk about On Corporate Laws at osmania university hyderabad
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ చట్టాలలో నూతన ధోరణులు.. భారత సామాజిక, ఆర్థిక ప్రగతిపై వాటి ప్రభావం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.
బ్యాంకుల మెరుగైన పనితీరుకు కొత్త చట్టాలు అవసరం