SC Dismisses BRS Election Symbol Petitions :ఎన్నికల గుర్తులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. కారును పోలిన గుర్తులు రద్దు చేయాలని వేసిన 2 పిటిషన్లను కొట్టి వేసింది. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అధికార పార్టీగా ఉండి 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Lawmakers Immunity : చట్టసభ సభ్యులు అవినీతికి పాల్పడితే విచారణ నుంచి రక్షణ!
Supreme Court on BRS Election Symbol :రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు రద్దు చేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్‌పై (BRS Petitions).. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లు.. గుర్తులకు తేడా తెలియనంత నిరక్షరాస్యులు కాదని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చాకే ఇలాంటివి గుర్తుకొస్తాయా అని అడిగింది. ఇలాంటి పిటిషన్లతో ఎన్నికల వాయిదా కోరుకుంటున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరగా.. మెరిట్స్ ఆధారంగానే హైకోర్టు విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కారును పోలిన వాటిని ఎన్నికల గుర్తుల జాబితా నుంచి తొలగించాలంటూ ఇటీవలే దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఉపసంహరించుకుంది. కారును పోలిన ఆటో, చపాతీ రోలర్, రోడ్డు రోలర్ తదితర గుర్తులతో భారత్ రాష్ట్ర సమితి నష్టపోతోందని, వాటిని జాబితా నుంచి తొలగించాలని పార్టీ తరఫున దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ ఏకసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే కొన్ని కారణాల రీత్యా తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని, అందుకు అనుమతించాలని బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోడా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయస్థానం అనుమతించింది.