ఖమ్మం జిల్లాలో ఎస్సీ బాలికల వసతిగృహంలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి చెందిన ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆరా తీసింది. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సంక్షేమ శాఖ డీడీతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాంల్సిందింగా సంబంధిత మంత్రిని కోరారు.
వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా - ఖమ్మం వసతి గృహ ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా
ఖమ్మం జిల్లా ఎస్సీ బాలికల వసతిగృహంలో విద్యార్థిని మృతిపై అధికారుల నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వివరాలు సేకరించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
![వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3852182-thumbnail-3x2-kmmgupta.jpg)
ఎస్సీ కమిషన్
Last Updated : Jul 16, 2019, 8:00 PM IST