ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల విషయంలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఓయూలో నియమించిన బోధన, బోధనేతర ఉద్యోగాల విషయంలో అధికారులు, కమిషన్ సభ్యులకు మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
ఓయూ అధికారులపై 'ఎర్రోళ్ల' ఆగ్రహం - ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఓయూలో ఉద్యోగ నియామకంలో రిజర్వేషన్ల అమలుపై ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారా లేదా అనే అంశంపై కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరా తీశారు. ఉద్యోగాల విషయంలో పాత రికార్డులకు కొత్త రికార్డులకు పొంతన లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.