తెలంగాణ

telangana

ETV Bharat / state

15 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు అందించనున్న ఎస్బీఐ

కరోనా బాధితులకు సాయం చేయడానికి ఎస్బీఐ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు 15 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను అందించనుంది.

sbi
sbi

By

Published : May 15, 2021, 8:03 PM IST

Updated : May 15, 2021, 10:05 PM IST

కొవిడ్​ బాధితులను ఆదుకునేందుకు ఎస్బీఐ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్, ఎస్బీఐ ఫౌండేషన్ సమన్వయంతో కొవిడ్ సహాయ చర్యలు చేపట్టనుందని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్​ మిశ్రా తెలిపారు. మూడు జిల్లాలకు ఐదు చొప్పున 15 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల రూ.12.25 లక్షలతో కొనుగోలు చేసి అందించనున్నామని చెప్పారు.

వికారాబాద్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు వీటిని అందించనున్నారు. ఈ సందర్బంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు హైదరాబాద్ ఎస్బీఐ స్థానిక, ప్రధాన కార్యాలయాల నుంచి దృశ్య మాద్యమ సమావేశం నిర్వహించారు. గత ఏడాది రెండు కోట్ల రూపాయలకుపైగా వెచ్చించి... వెంటిలేటర్లు, మల్టీ పేషెంట్ మానిటర్లు, ఈసీజీ మెషీన్లు, 2డీ ఎకో, రేడియో మీటర్, డిజిటల్ పల్స్ ఆక్సి మీటర్లు వంటి వైద్య పరికరాలు, 8000 పీపీఈ కిట్లు, ఆహార సరఫరా, డ్రై రేషన్ కిట్లు మొదలైన వాటిని అందజేశామని మిశ్రా తెలిపారు.

ఇదీ చదవండి: అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం

Last Updated : May 15, 2021, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details