తెలంగాణ

telangana

ETV Bharat / state

SBI: చెవిటి, మూగ విద్యార్థులకు ఎస్బీఐ లేడీస్​ క్లబ్​ విభాగం చేయూత

చెవిటి, మూగ విద్యార్థులకు చేయూత అందించేందుకు భారతీయ స్టేట్​ బ్యాంకు(state bank of india) చెవిటి, మూగ విద్యార్థులకు ముందుకొచ్చింది. ఫిన్​ అనే స్వచ్ఛంద సంస్థ వారి బాగోగులు చూసుకుంటుండగా.. ఎస్బీఐ సీజీఎం సతీమణి నూపుర్‌ జింగ్రాన్‌ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న విద్యార్థులకు అవసరమైన వస్తు సామాగ్రి అందజేశారు.

SBI: చెవిటి, మూగ విద్యార్థులకు ఎస్బీఐ లేడీస్​ క్లబ్​ విభాగం చేయూత
SBI: చెవిటి, మూగ విద్యార్థులకు ఎస్బీఐ లేడీస్​ క్లబ్​ విభాగం చేయూత

By

Published : Oct 22, 2021, 7:57 PM IST

హైదరాబాద్‌ మూసారాంబాగ్‌లో చెవిటి, మూగ విద్యార్థులకు భారతీయ స్టేట్‌ బ్యాంకు(state bank of india) లేడీస్‌ క్లబ్‌ విభాగం చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. గురువారం ప్రత్యేక వైద్యశిబిరాన్ని(sbi health camp) నిర్వహించింది. ఫిన్​ అనే స్వచ్ఛంద సంస్థ చెవిటి, మూగ పిల్లల బాగోగులు చూసుకుంటోంది. ఎస్బీఐ సీజీఎం సతీమణి నూపుర్‌ జింగ్రాన్‌ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న విద్యార్థులకు అవసరమైన వస్తు సామాగ్రి అందజేశారు. ప్రధానంగా వారికి అవసరమైన స్కూల్‌ బ్యాగ్‌లు, స్టేషనరీ, పుస్తకాలు, బెడ్‌షీట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, ఔషధాలను నూపుర్‌ జింగ్రాన్‌ పంపిణీ చేశారు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ సేవలను ఆమె కొనియాడారు. ఎస్బీఐ సీఎస్‌ఆర్‌ కింద అనాథాశ్రమాలకు చేయూత ఇస్తున్నట్లు ఏజీఎం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఫిన్‌ స్వచ్ఛంద సంస్థ తమకు కంప్యూటర్‌ ల్యాబ్‌ కావాలని, మౌలిక వసతులు కల్పించాలని ఎస్బీఐకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే వాటికి చెంది ఎంత ఖర్చు అవుతుందో... తమ బృందం అంచనా వేసి...వీలైనంత త్వరలో కంప్యూటర్‌ ల్యాబ్‌తో పాటు మౌలిక వసతులు, చిన్నపాటి మరమ్మతులు లాంటివి చేపడతామని రామకృష్ణ వివరించారు.

SBI: చెవిటి, మూగ విద్యార్థులకు ఎస్బీఐ లేడీస్​ క్లబ్​ విభాగం చేయూత

లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్న సంస్థ

ఫిన్​ స్వచ్ఛంద సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా హైదరాబాద్, తెలంగాణలోని వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ 2007లో స్థాపించబడింది. వినికిడి లోపంతో బాధపడుతున్న 100 మంది పిల్లలకు ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం, విద్యను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఏజెన్సీల మద్దతుతో ఫిన్​ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినికిడి లోపం ఉన్నవారి సమస్యలను హైలైట్ చేయగలిగింది. ఈ సంస్థ సేవలను భారత ప్రభుత్వం గుర్తించి.. 2007లో హెలెన కెల్లర్ జాతీయ​ అవార్డు, 2013లో రోల్ మోడల్ జాతీయ అవార్డును ప్రధానం చేసింది. ఫిన్​ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అవార్డులను పొందింది.

సమాజంలోని అర్హులైన అన్ని వర్గాలకు చేరువయ్యే బ్యాంకు ఎస్బీఐ. స్టేట్​ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడియోమెట్రీ పరీక్షా శిబిరం పిల్లలకు వినికిడి యంత్రాలను అందించడంలో సహాయపడుతుంది. కంప్యూటర్ ల్యాబ్ అందించడం, పాఠశాలలో సాధారణ పరిశుభ్రత సౌకర్యాలను మెరుగుపరచడం వంటి సాధ్యాసాధ్యాలను కూడా బ్యాంక్ పరిశీలిస్తుంది. -నూపుర్ జింగ్రాన్, ఎస్బీఐ సీజీఎం అమిత్​ జింగ్రాన్​ భార్య

చెవిటి, మూగ విద్యార్థులకు ఎస్బీఐ లేడీస్​ క్లబ్​ విభాగం చేయూత

ఇదీ చదవండి: DRDO Abhyas test: 'అభ్యాస్' పరీక్ష విజయవంతం​

ABOUT THE AUTHOR

...view details