ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని వీపీ జ్ఞానభూమి వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ 2ను శనివారం నిర్వహించారు. ఈ రన్లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. కొవిడ్ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు పలు ఫిట్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉద్యోగులంతా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి: ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ - తెలంగాణ తాజా వార్తలు
ఉద్యోగులంతా యోగా, కసరత్తులు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అన్నారు. నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమివద్ద ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్2ను నిర్వహించారు.
fit India freedom run
ఉద్యోగులంతా యోగా, నడవటం, సైక్లింగ్ లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. కసరత్తును రోజు వారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవటం ద్వారా ఫిట్ ఇండియాలో భాగం పంచుకోవాలన్నారు.
ఇదీ చూడండి:బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి సందడి..