బ్యాంకింగ్ సేవల్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ భారతీయ స్టేట్ బ్యాంక్- హైదరాబాద్ శాఖ ఉదారతను చాటుతోంది. కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని సీఎస్‌ఆర్ కింద రెండు కోట్లు విలువైన వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు, వైద్య పరికరాలు, ఆహార పొట్లాలు వంటివి ఆసుపత్రులకు అందజేశారు. గురువారం హైదరాబాద్లోని ఎనిమిది వృద్ధాశ్రమాలకు, అనాథ ఆశ్రమాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు వితరణ చేశారు.
సేవారంగంలోనూ ఉదారతను చాటుతోన్న ఎస్బీఐ.. - హైదరాబాద్లోని వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎస్బీఐ
బ్యాంకింగ్ సేవల్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలోనూ ఎస్బీఐ హైదరాబాద్ శాఖ ముందుంటోంది. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 8 వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలను పంపిణీ చేసింది.
సేవారంగంలోనూ తమదైన ఉదారతను చాటుతోన్న ఎస్బీఐ
ఒక్కో ఆశ్రమానికి దాదాపు రూ.30 వేల విలువైన బియ్యం, పప్పు, ఉప్పు అందించారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఎస్బీఐ సర్కిల్ సీజీఎం ఓపీ మిశ్రా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనాథ ఆశ్రమాల్లోని విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, పెన్‌లు, ఇతర స్టేషనరీ అందజేశారు.
ఇదీ చూడండి:కేంద్రం మద్దతు ధర ఇస్తేనే రైతులకు ప్రయోజనం: నిరంజన్ రెడ్డి