తెలంగాణ

telangana

ETV Bharat / state

SBI Donation to CCMB : సీసీఎంబీకి భారీ విరాళం ఇచ్చిన ఎస్బీఐ - ఎస్బీఐ ఫౌండేషన్​ డొనేషన్​

SBI Donation to CCMB : దేశంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు, డేటా అందించేందుకు సీసీఎంబీ విశేష కృషి చేస్తోందని ఎస్బీఐ ఛైర్మన్​ దినేశ్​ ఖరా పేర్కొన్నారు. ఎస్బీఐ ఫౌండేషన్‌ ద్వారా సీఎస్‌ఆర్‌ కింద రూ.9.94కోట్ల చెక్కును సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌కు అందించారు.

SBI Donation to CCMB
SBI Donation to CCMB

By

Published : Dec 29, 2021, 4:50 AM IST

SBI Donation to CCMB : సీసీఎంబీకి ఎస్బీఐ భారీ విరాళం అందచేసింది. సీఎస్​ఆర్​ కింద ఎస్బీఐ ఫౌండేషన్​ ద్వారా రూ.9.94 కోట్ల అందించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తార్నాక సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (CCMB) డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌కు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా అందచేశారు.

సీసీఎంబీ జెనోమిక్స్ గైడెడ్ పాండమిక్ ప్రీవెన్షన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరో రెండు శాటిలైట్ సెంటర్‌లు ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఎస్బీఐ తరఫున సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలు, దాని అనుబంధ సంస్థల కార్యకలాపాలను నిర్వహించేందుకు 2015లో ఎస్బీఐ పౌండేషన్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేదలు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి, మానవత్వాన్ని చాటేందుకే తమ బ్యాంక్... సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్​ వైరస్‌తో పోరాడటానికి సమయం, అనుభవం చాలా అవసరమని ఖరా పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సీఎస్​ను కలిసిన చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులు.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details