అంకుర కంపెనీలకు ఊతం ఇస్తూ.. వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఎస్బీఐ ముందుకొచ్చింది. ఇందుకోసం బ్యాంక్ కొత్తగా ఇన్ క్యూబ్ ఏర్పాటు చేసింది. అంకుర కంపెనీలు ఇన్ క్యూబ్ ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో స్టార్ట్ అప్ లాంజ్ ఇన్ క్యూబ్ సెంటర్ను ఎస్బీఐ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా తెలిపారు. తమ సంస్థలో పరిశోధన విద్యార్థులు అధికంగా ఉన్నారని... వారికి ప్రభుత్వం నుంచి అనుకున్నంత సాయం అందడం లేదని త్రిపుల్ ఐటీ ప్రొ.నారాయణ అన్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం ఎస్బీఐ ఇన్ క్యూబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్టార్ అప్ ఐడియాలాజీ ఉన్న విద్యార్థులకు ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం లభిస్తుందని తెలిపారు. పరిశోధన విద్యార్థులు.. తమ ఇన్ క్యూబ్ సేవలు ఉపయోగించుకోవాలని సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రా సూచించారు.
'అంకుర కంపెనీలకు ఎస్బీఐ ఆర్థిక సాయం'
అంకుర కంపెనీలను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ ముందుకొచ్చింది. ఆర్థిక వనరులు సమకూర్చేందుకు ఇన్ క్యూబ్ పేరుతో కొత్త సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎస్బీఐ అంకుర సంస్థలు