భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ)తో జరిపిన తాజా చర్చలు విఫలమవ్వడం వల్ల సికింద్రాబాద్ ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉద్యోగుల పే స్కేల్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
'వారంలో రెండ్రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలి'
డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా సికింద్రాబాద్ ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసనకు దిగారు.
'వారంలో రెండ్రోజులు సెలవు దినాలుగా ప్రకటించాలి'
వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా పరిగణించి, మిగిలిన రెండు రోజులు సెలవులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, పింఛన్ల విషయంలో మార్పులు తీసుకు రావాలని కోరారు.
సికింద్రాబాద్ ఎస్బీఐ బ్యాంకు వద్ద పెద్దఎత్తున ఉద్యోగులు చేరి తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రానున్న రోజుల్లో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.