తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ - Sbi Help Migrant Labours

లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సికింద్రాబాద్‌ ఎస్‌బీఐ సిబ్బంది అండగా నిలిచారు. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోని 160 మంది వలస కార్మికులకు దుప్పట్లు, టవళ్లు పంపిణీ చేశారు.

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో బెడ్‌షీట్లు పంపిణీ
ఎస్‌బీఐ ఆధ్వర్యంలో బెడ్‌షీట్లు పంపిణీ

By

Published : Apr 19, 2020, 8:15 PM IST

హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ విక్టోరియా మైదానంలో ఆశ్రయం పొందుతున్న 160 మంది వలస కార్మికులకు సికింద్రాబాద్‌ ఎస్‌బీఐ పరిపాలనా కార్యాలయ సిబ్బంది ఆపన్నహస్తం అందించారు. ఉద్యోగులందరు కలిసికట్టుగా రూ.75 వేలు జమచేసి కార్మికులకు అవసరమైన దుప్పట్లు, టవళ్లు, సబ్బులు, టూత్‌పేస్ట్‌ వంటి వాటిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం ఓపీ మిశ్రాతో కలిసి డీజీఎం వనిత భట్టా ఛటర్జీ, హిమాయత్‌నగర్‌ ఆర్‌ఎం ఉషాశంకర్‌, ఏజీఎం హనుమంతరావులు సరుకులు పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details