సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావటమే ఎస్బీఐ కార్పొరేట్ సామాజిక లక్ష్యమని... ఆ బ్యాంకు డిప్యూటీ ఎమ్డీ మేనేజింగ్ డైరెక్టర్ సలోని నారాయణ్ అన్నారు. పేదవర్గాలను ఆదుకోవడానికి నిరంతరం ఎస్బీఐ కృషి చేస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగులకు సేవలందిస్తోన్న ఖమ్మంలోని శాంతి నిలయం రిహాబిలిటేషన్ కేంద్రానికి ఒక మారుతీ ఎకో వ్యాన్‌ను విరాళంగా హైదరాబాద్‌లో అందించారు.
'సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావటమే మా లక్ష్యం' - Hyderabad District latest News
ఆర్థికంగా, భౌతికంగా, సామాజికంగా వెనుకబడ్డ వారి జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురావటమే ఎస్బీఐ కార్పొరేట్ సామాజిక బాధ్యతని... ఆ బ్యాంకు డిప్యూటీ ఎమ్డీ సలోని నారాయణ్ అన్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు సేవలందిస్తోన్న పలు స్వచ్ఛంద సంస్థలకు మారుతీ వ్యాన్లను విరాళంగా అందించారు.
'సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావటమే మా లక్ష్యం'
నాచారంలోని సీనియర్ సిటిజన్స్ కేర్ హోమ్‌కు మారుతీ సూపర్ క్యారీ వ్యాన్‌ను భారతీయ స్టేట్ బ్యాంకు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సీఎస్ఆర్ కార్యక్రమాల కోసం రూ. 2.9 కోట్లు ఖర్చు చేసినట్లు... ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా తెలిపారు.
ఇదీ చదవండి:ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడతాం: బండి సంజయ్