తెలంగాణ

telangana

ETV Bharat / state

Amith Jingran: 'ఉత్పత్తి రంగంలో విశేష అభివృద్ధిని సాధించాం' - Telangana news

హైదరాబాద్​ కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌ జెండా ఎగురవేశారు. హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌ ఆయా విభాగాల్లో మంచి ప్రతిభను కనపరచిన వారికి ధ్రువీకరణ పత్రాలతోపాటు మొమెంటోలు అందచేసి సత్కరించారు.

independence day celebrations
independence day celebrations

By

Published : Aug 15, 2021, 10:57 PM IST

ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్య్రం సిద్దించిన ఈ 75 సంవత్సరాలల్లో... భారత్‌ ఉత్పత్తి రంగంలో విశేష అభివృద్ధిని సాధించిందని భారతీయ స్టేట్‌ బ్యాంక్​ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ (Amith Jingran) అన్నారు. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీజీఎం జింగ్రాన్​ జెండా ఎగురవేశారు. భారత మాతకు అనుకూలంగా నినదించారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత అన్ని రంగాల్లోనూ స్వయం సంవృద్ధి సాధిస్తూ వస్తున్నట్లు తెలిపారు. గుండు పిన్ను నుంచి ఎయిర్‌ క్రాప్ట్‌ వరకు, హైడల్‌ విద్యుత్తు నుంచి సోలార్‌ శక్తి వరకు, సైకిల్‌ నుంచి విలాసవంతమైన కార్ల వరకు స్వతహాగా తయారు చేసుకుంటున్నామని ఆయన కొనియాడారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ వ్యాధి నిరోధానికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందన్నారు.

ఈ డిసెంబర్​ చివర నాటికి యాభై కోట్ల మందికి పైగా జనాభాకు... వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఆటలు, పాటలు, కళల్లో, విద్యలో బాగా రాణించిన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులను స్టేట్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యం ఇవాళ సత్కరించింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌ ఆయా విభాగాల్లో మంచి ప్రతిభను కనపరచిన వారికి ధ్రువీకరణ పత్రాలతోపాటు మొమెంటోలు అందచేసి సత్కరించారు. కార్పొరేట్‌ సామాజిక సేవలో భాగంగా నాగోల్‌కు చెందిన లాలన వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌కు రూ. లక్ష విలువైన బట్టలు, మాస్కులు, శానిటైజర్లు ఇతర వస్తువులు అందచేశారు.

ఇదీ చదవండి: CM KCR: దళితబంధు ఓ పథకం కాదు.. ఉద్యమం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details