తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరో ఏడాదీ... 15 పులులను దత్తత తీసుకున్న ఎస్బీఐ - SBI ADOPTS 15 TIGERS IN 6TH YEAR FROM NEHRU ZOO PARK

వరుసగా ఆరో ఏడాది సామాజిక బాధ్యత నిర్వర్తిస్తూ... పలు సంస్థలకు ఆదర్శంగా నిలిచింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. హైదరాబాద్​ నెహ్రూ జూపార్క్​లోని 15 పులులను ఎస్బీఐ దత్తత తీసుకుంది.

SBI ADOPTS 15 TIGERS IN 6TH YEAR FROM NEHRU ZOO PARK
SBI ADOPTS 15 TIGERS IN 6TH YEAR FROM NEHRU ZOO PARK

By

Published : Nov 30, 2019, 5:29 AM IST

Updated : Nov 30, 2019, 10:30 AM IST

సామాజిక బాధ్యత కింద హైదరాబాద్ నెహ్రూ జూపార్క్​లోని 15 పులులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకుంది. ఈ మేరకు జూపార్క్​లో జరిగిన కార్యక్రమంలో అటవీ ప్రధాన సంరక్షణాధికారి శోభకు ఎస్బీఐ అధికారులు రూ.15 లక్షల చెక్ అందించారు. వరుసగా ఆరో ఏడాది పులులను దత్తత తీసుకునేందుకు ముందుక వచ్చిన ఎస్బీఐని అటవీశాఖ అధికారులను అభినందించారు.

జూపార్క్​లో వన్యప్రాణులను దత్తత తీసుకునేందుకు ఇతర బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఎస్బీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో నిర్వహణ, జంతువులను జాగ్రత్తగా చూసుకుంటున్న తీరు తమను ఆకట్టుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక జంతుప్రదర్శనశాలలను సందర్శించానని... నెహ్రూ పార్క్ మాత్రం అన్ని అంశాలలో ఉత్తమమైనదని అధికారులు ప్రశంసించారు.

ఆరో ఏడాదీ... 15 పులులను దత్తత తీసుకున్న ఎస్బీఐ

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Last Updated : Nov 30, 2019, 10:30 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details