కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్‌కు చెందిన రమేష్, నరేష్ ఓ ఏజెంట్ ద్వారా ఉపాధి కోసం మలేషియాకు వెళ్లారు. హోటల్లో పనిచేయాలని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి ఇద్దరు కలిసి లక్ష 20 వేల రూపాయలు చెల్లించారు. అక్కడ ఎటువంటి ఉద్యోగం లభించకపోవటం వల్ల చివరకు కూలీ పని చేయాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి తెలుగు వారి చేయూతతో స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.
ఉద్యోగమని చెప్పి... ఏజెంట్ మోసం - gent fraud
ట్రావెల్ ఏజెంట్ మోసంతో బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లిన కరీంనగర్ జిల్లా వాసులు అక్కడ బందీలయ్యారు. తినడానికి తిండిలేక, స్వదేశానికి రావడానికి డబ్బుల్లేక దేశం కాని దేశంలో నరకయాతన అనుభవించారు. చివరకు ప్రవాసాంధ్రుల సాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
ఉద్యోగమని చెప్పి... ఏజెంట్ మోసం